Venkatesh Maha – SatyaDev | ‘కేరాఫ్ కంచరపాలెం’ ,’ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేశ్ మహా. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాల అనంతరం వెంకటేశ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఆర్బీ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో సత్యదేవ్ కథానాయకుడిగా నటించబోతుండగా.. జీఎంబీ, శ్రీచక్ర ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లపై మహేశ్ బాబు, అనురాగ్ రెడ్డి నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని రేపు మధ్యాహ్నం12.12 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Extremely grateful to @urstrulyMahesh Sir, @urstrulynamrata Ma’am, @anuragmayreddy #SharathChandra , and #ChintaGopalakrishnaReddy Garu – this wouldn’t have been possible without you. 🙏🏼
I’m back – as humble as ever, more creative than before, and with my one and only… pic.twitter.com/0INIMJZYNE— Venkatesh Maha (@mahaisnotanoun) August 11, 2025