Mumbaikar | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. విజయ్ సేతుపతి ముంబైకర్ రిలీజ్ టైం ఫిక్స్
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హిందీ డెబ్యూ మూవీ ముంబైకర్ (Mumbaikar). ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎన్నో నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా మొత్తానికి మూవీ లవర్స్ కు వినోదాన్ని పంచేందుకు రెడీ అయింది.
Mumbaikar | తెలుగు, తమిళంతోపాటు హిందీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈ స్టార్ హీరో నటించిన హిందీ డెబ్యూ మూవీ ముంబైకర్ (Mumbaikar). ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎన్నో నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా మొత్తానికి మూవీ లవర్స్ కు వినోదాన్ని పంచేందుకు రెడీ అయింది. ముంబైకర్ చిత్రాన్ని డైరెక్టుగా ఓటీటీ ప్లాట్‌ఫాం జియో సినిమాలో జూన్ 2న విడుదల చేస్తున్నట్టు జియో స్టూడియోస్ (Jio Studios) అధికారికంగా ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీజర్‌ను కూడా షేర్ చేసింది.
ఇందులో విజయ్ సేతుపతి ఓ చిన్నారిని కిడ్నాప్ చేసే గ్యాంగ్ స్టర్‌గా కనిపించబోతున్నట్టు టీజర్‌తో అర్థమవుతోంది. కిడ్నాప్ చేసిన తర్వాత విజయ్ సేతుపతి ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడనేది మిగిలిన కథ. ముంబైకర్ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్టు జియో స్టూడియోస్ తెలియజేసింది. పాపులర్ డీవోపీ సంతోష్ శివన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో విక్రాంత్ మెస్సీ, తాన్య మణిక్తల, రాఘవ్ బినాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2021లో మొదలైన ఈ చిత్రం ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. చాలా నెలల నిరీక్షణ అనంతరం రిలీజవుతుండటంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మక్కళ్ సెల్వన్ ఫ్యాన్స్.
ముంబైకర్ చిత్రానికి స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కథనందించడం విశేషం. హెచ్ఆర్ పిక్చర్స్, జియో స్టూడియోస్ సందయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సలిల్ అమృతే, రాం సురేందర్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ సేతుపతి మరోవైపు హిందీలో మేరీ క్రిస్మస్, జవాన్ చిత్రాలతోపాటు మూవీ సినిమా గాంధీ టాకీస్‌లో కూడా నటిస్తున్నాడు.
ముంబైకర్ టీజర్..
Mumbai sheher, ek kidnapping aur bohot saara confusion! Kya yeh galti se hui mistake padegi sab pe bhaari? #Mumbaikar streaming from 2nd June for free, only on @officialjiocinema#Mumbaikar #JioCinema #JioStudios #MumbaikarOnJioCinema pic.twitter.com/C9l1PQ4e2g
— Jio Studios (@jiostudios) May 25, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

