ఇలియానాను దర్శకనిర్మాతలు కావాలనే దూరం పెడుతున్నారా..?

ఇలియానాకు ఒకప్పుడు తెలుగులో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? నెంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిప్పింది ఈ గోవా బ్యూటీ. ఈమె నడుము ఒంపుల్లో పడి నలగని కుర్రాడి గుండె లేదంటే నమ్మశక్యం కాదేమో..? అంతగా తన ఒంపుసొంపులతో మాయ చేసింది ఇలియానా. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవరి టైం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఒక శుక్రవారం సినిమా తేడా కొడుతుంది అంటే ఇక్కడ అందరూ మర్చిపోతారు.
అలాంటిది ఇలియానా విషయంలో ఒక శుక్రవారం కాదు నాలుగైదు శుక్రవారాలు తేడా కొట్టాయి. అందుకే ఈమె టైమ్ కూడా అయిపోయింది. నిజానికి కెరీర్ పీక్స్ లో ఉన్నపుడే ఇలియానా తీసుకున్న ఓ నిర్ణయం ఈమె కెరీర్ ను కష్టాల్లోకి నెట్టేసింది. అదే బాలీవుడ్ కు వెళ్లడం.. అది కూడా సౌత్‌లో టాప్ పొజిషన్ లో ఉన్నపుడే బాలీవుడ్ వెళ్లడం.
జులాయి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీని వదిలేసింది ఇలియానా. ఆ తర్వాత మన దర్శక నిర్మాతలు. ఈ భామను వదిలేసారు. దాంతో అప్పట్నుంచి అవకాశాలు రావడం తగ్గిపోయాయి. అయితే అవకాశాలు రావట్లేదు రావట్లేదు అని ఏడ్చేకంటే వచ్చిన అవకాశాలు ఎలా యూజ్ చేసుకోవాలో తెలిసుండాలి. ఈ విషయంలో ఇలియానా పిహెచ్ డీ కాదు దాని అమ్మమ్మనే పూర్తిచేసింది.
అమ్మడుకు బాలీవుడ్ లో ఛాన్సులు రాక మూడేళ్లవుతుంది. అప్పుడెప్పుడో హ్యాపీ ఎండింగ్ తోనే ఇల్లీ బేబీ కెరీర్ కు హ్యాపీ క్లోజింగ్ పడిపోయింది. ఆ తర్వాత కూడా ఒకట్రెండు సినిమాలు చేసినా కూడా కనీసం అవి వచ్చి వెళ్లినట్లు కూడా తెలియదు. అప్పటి నుంచి అవకాశాల కోసం వేచి చూస్తూనే.. మరోవైపు బికినీ ఫోటోషూట్లు, చిట్టిపొట్టి డ్రస్సుల్లో అందాల ఆరబోతలు చేస్తుంది గోవాబ్యూటీ.
రుస్తుమ్ లాంటి సినిమాలు బాగానే ఆడినా కూడా అవకాశాలు మాత్రం రాలేదు. ఆ మధ్య బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కు బ్రేకప్ కూడా చెప్పిన ఇలియానా.. ఒక్కసారిగా ఫిజిక్ పై పట్టు కోల్పోయింది. బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన తర్వాత మళ్లీ ఫిజిక్ పై ఫోకస్ చేసింది ఇల్లీ బేబీ. జిమ్ లో గంటలు గంటలు కష్టపడి మళ్లీ మామూలు స్టేటస్ కు వచ్చేసింది. ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అంతే నాజూగ్గా కనిపిస్తుంది. అయితే ఎంత చేసినా కూడా ఇలియానాకు అవకాశాలు రావడం లేదు.
ఈమెను కావాలని దర్శక నిర్మాతలు దూరం పెడుతున్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో ఈమెపై బ్యాన్ ఉంది. అక్కడ ఒక సినిమాకు కమిట్ అయి పూర్తి చేయకుండా బాలీవుడ్ కి వెళ్ళిపోయింది అంటూ నిర్మాతల మండలి ఈమెపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాన్ తెలుగులో కూడా కంటిన్యూ చేయాలని నిర్మాతలు కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ గోవా సుందరికి ఎక్కడా అవకాశం రావడం లేదు.
ఇవి కూడా చదవండి..
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

