Vijay Sethupathi | తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి. ప్రస్తుతం అరవింద్ స్వామితో కలిసి గాంధీ టాక్స్ సినిమాలో నటిస్తున్నాడు. సాదాసీదా నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడం ఈ టాలెంటెడ్ నటుడి స్పెషాలిటీ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు మక్కళ్ సెల్వన్.
ఈ రోజుల్లో చాలా మంది యాక్టర్లు, డైరెక్టర్లు తమ సినిమాలు ప్రేక్షకులను ఆకర్షించేందుకు హైప్ క్రియేట్ చేసేందుకు ఏదో ఒక విషయాన్ని హైలెట్ చేయాలని ప్రయత్నిస్తుంటారని తెలిసిందే. విజయ్ సేతుపతి తన అప్‌కమింగ్ మూకీ సినిమా ‘గాంధీ టాక్స్’ గురించి మాట్లాడాడు.. డైలాగ్స్ లేకుండా ఎమోషన్స్‌తో ప్రేక్షకులతో దగ్గరయ్యేందుకు రెడీ అవుతున్నారు విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి.
ప్రేక్షకులకు వినోదం కోసం థియేటర్లకు వస్తారు కాబట్టి ఫిల్మ్‌మేకర్స్ ప్రేక్షకులు అర్థం చేసుకోలేని విధంగా సినిమా తీయొద్దని సూచించాడు విజయ్ సేతుపతి. ఓ వైపు ప్రయోగాలకు వెల్ కమ్ చెబుతూనే.. మరోవైపు ప్రేక్షకులు ప్రత్యేకించి డబ్బులు చెల్లించి సినిమా చూసేందుకు వస్తున్నప్పుడు వారికి ఖర్చు భారమనిపించేలా సినిమా ఉండకూడదని అన్నాడు విజయ్ సేతుపతి. గాంధీ టాక్స్ స్పెషల్ సినిమా ఏం కాదు.. కానీ సరికొత్త సినిమా చూసిన అనుభూతిని మాత్రం తప్పకుండా ఇస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
సినిమా సంప్రదాయ ఫార్మాట్ (రెగ్యులర్ సినిమాలలా)ను ఫాలో అవకపోవడంతో గాంధీ టాక్స్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో టీం మెంబర్స్ అంతా మొదట
ఆందోళన చెందారని.. అయితే దగ్గరి స్నేహితులకు స్పెషల్ స్క్రీనింగ్ వేసిన తర్వాత పాజిటివ్ స్పందన వచ్చిందని.. దాంతో సినిమాపై నమ్మంక పెరిగిందన్నాడు విజయ్ సేతుపతి. అయితే వారిచ్చిన ఫీడ్ బ్యాక్ సినిమా మార్కెట్ కోసం ఉపయోగపడదని కూడా చెప్పాడు. టీం అంతా ముందుగా ఈ చిత్రాన్ని సూపర్ హిట్ అవుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ వారిప్పుడు సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చాడు.