Constable OTT | యంగ్ హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘కానిస్టేబుల్’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది అక్టోబరులో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శంకరపల్లి అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. వరుస హత్యలు ఆ ఊరిని వణికిస్తుంటాయి. ఈ క్రమంలోనే అక్కడ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కాశీ (వరుణ్ సందేశ్) మేనకోడలు కూడా దారుణ హత్యకు గురవుతుంది. తన సొంత మనిషిని కోల్పోయిన బాధలో ఉన్న కాశీ, ఆ సీరియల్ కిల్లర్ గుట్టును ఎలా రట్టు చేశాడు? ఆ హంతకుడి వెనుక ఉన్న అసలు రహస్యాలేమిటి? అనే ఉత్కంఠభరిత అంశాలతో ఈ చిత్రం రూపొందింది.
ఆర్యన్ సుభాస్ ఎస్కే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ సందేశ్ సరసన మధులిక వారణాసి కథానాయికగా నటించగా, మురళీధర్ గౌడ్, రవివర్మ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న వరుణ్ సందేశ్, ఈ చిత్రంలో ఒక సీరియస్ పోలీస్ పాత్రలో కనిపించడం విశేషం.
A uniform. A mission. A fight for justice. 🚔
Step into the intense world of CONSTABLE. ⚡
Streaming now on @etvwin#Constable #etvwin @itsvarunsandesh @jagruthimo35921 @MadhulikaVaran1 @UrsNityasri @kashishhrajput @pawkups pic.twitter.com/R1yB0zummX— ETV Win (@etvwin) January 29, 2026