కర్ణాటక తులునాడులో పూజింపబడే దైవం ‘కొరగజ్జ’ కథతో ఓ సినిమా రాబోతున్నది. సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ సాఫల్య నిర్మిస్తున్నారు. ఇటీవల కర్ణాటక మంగళూరులో ఆడియోను ఆవిష్కరించారు. గోపీసుందర్ స్వరకర్త. ‘కాంతర’ తరహాలో గ్రామీణ సంస్కృతి, ఆచారాలు కలబోసిన దైవగాథ ఇదని, ప్రేక్షకుల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించేలా ఉంటుందని దర్శకుడు తెలిపారు.
పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాత త్రివిక్రమ్ సాఫల్య పేర్కొన్నారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని గోపీసుందర్ తెలిపారు. ఈ చిత్రానికి కథా పరిశోధన, స్క్రీన్ప్లే, సాహిత్యం, సంభాషణ: సుధీర్ అత్తవర్.