సినీ జానసద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత
సినీ నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ సికింద్రాబాద్ చిలకలగూడ లోని ఆయన స్వగృహంలో గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
సినీ నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ సికింద్రాబాద్ చిలకలగూడ లోని ఆయన స్వగృహంలో గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘పిల్లా నువ్వులేని జీవితం’ పాటతో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా ‘కింగ్’ సినిమాలో ‘గింత గింత బాల చుకవే’ అనే పాట పాడి అనేక మంది హృదయాలను గెలుచుకున్నాడు. వడేపల్లి శ్రీనివాస్. అనేక జానపద గేయాలు, వేల స్టేజీ ప్రోగ్రాంలు చేసి నంది అవార్డుతో పాటూ ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆయన వరంగల్ జిల్లాలో జన్మించారు.
చిన్నప్పుడే హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణలో గొప్ప జానపద కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ‘నమస్తే అన్న’ చిత్రంలో సుద్దాల అశోక్ తేజ రాసిన ‘గరం గరం పోరీ నా గజ్జెల సవ్వారీ’ అనే పాట ద్వారా సినీ నేపథ్య గాయకుడిగా పరిచయయ్యాడు. అనేక ప్రైవేట్ ఆల్బమ్స్లలో ఆయన పాడిన జానపద గీతాలు విశేష ఆదరణ పొందాయి. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గురువారం సాయంత్రం అంత్యక్రియలు సీతాఫల్మండి హిందూ శ్మశాన వాటికలో జరిగాయి. అంత్యక్రియలకు సంగీత దర్శకులు విష్ణు కిషోర్, జానపద కవి గాయకుడు నేర్నాల కిషోర్, గాయని స్వర్ణక ,గాయకుడు బోనాల ప్రకాష్ , కళాకారుడు సంపత్ , గాయకురాలు మల్లిక అనేకమంది కళాకారులు హాజరై సంతాపం తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

