HomeCinemaFatima Sana Shaikh Says Recalls A Harrowing Experience Of Being Assaulted And Harassing
అతను నన్ను తిరిగి కొట్టాడు!
జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు దంగల్ భామ ఫాతిమా సనాషేక్. ఆమె మాట్లాడుతూ ‘గతంలో ఓ వ్యక్తి నన్ను ఇబ్బందికరంగా తాకాడు. అతను అసభ్యకరంగా ప్రవర్తించడంతో నాకు సహనం నశించి అతని చెంప ఛెళ్లుమనిపించాను.
జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు దంగల్ భామ ఫాతిమా సనాషేక్. ఆమె మాట్లాడుతూ ‘గతంలో ఓ వ్యక్తి నన్ను ఇబ్బందికరంగా తాకాడు. అతను అసభ్యకరంగా ప్రవర్తించడంతో నాకు సహనం నశించి అతని చెంప ఛెళ్లుమనిపించాను. అతను వెంటనే నన్ను తిరిగి కొట్టాడు. నిజంగా నేను షాక్ అయ్యాను. తప్పు చేసింది అతను. నేను బాధితురాలిని. నన్నెలా కొడుతాడు? నిజంగా ఆ సంఘటన నన్నెంతో బాధించింది.
ఇప్పటికీ ఆ క్షణం గుర్తొస్తే చెప్పలేనంత కోపం వస్తుంది నాకు. ఇలాగే లాక్డౌన్ టైమ్‌లో ఓసారి సైకిల్ రైడ్‌కి వెళ్లాలనిపించి, మాస్క్ ధరించి ముంబయ్ రోడ్లమీదకు వెళ్లాను. నేను వెళ్తూ ఉంటే ఓ టెంపో డ్రైవర్ నన్ను ఫాలో అయ్యాడు. హారన్ మోగిస్తూ, ఇష్టం వచ్చినట్టు పిలుస్తూ వెంటాడు. అతడి మాటలు నన్నెంతో బాధించాయి. ఈ సందర్భంగా సాటి స్త్రీలకు నేను చెప్పేదొక్కటే. మనకేదైనా సమస్య ఎదురైతే.. దాన్ని మనమే ఎదుర్కోవాలి. మానసికంగా ధృఢంగా ఉంటేనే అది మనకు సాధ్యమవుతుంది.’ అంటూ చెప్పుకొచ్చారు ఫాతిమా సనాఫేక్.