Salaar | బాహుబలి ప్రాంచైజీ తర్వాత ప్రభాస్ (Prabhas) కెరీర్లోవన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచే చిత్రం సలార్ (Salaar). కేజీఎఫ్ ఫేం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రాంచైజీగా వస్తున్న విషయం తెలిసిందే. 2023 డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైన Salaar Part-1 Ceasefire బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
మరోవైపు సలార్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. కాగా సలార్ మేనియా మొదలై నేటితో రెండేళ్లు పూర్తయింది. సలార్ 2 నా బెస్ట్ వర్క్‌లో ఒకటిగా నిలుస్తుందని ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పడంతో.. పార్ట్ 2పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. నేటికి అన్‌స్టాపబుల్‌గా మూవీ లవర్స్‌లో సలార్ స్పిరిట్ కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సలార్ 2 (శౌర్యాంగపర్వం) వార్ త్వరలోనే మొదలు కానుందని వార్తలు వస్తుండగా.. సలార్ 2 సీక్వెల్ అప్డేట్ కోసం వెయిటింగ్ ఇక్కడ.. క్లారిటీ ఇవ్వండి అంటూ మూవీ లవర్స్‌తోపాటు అభిమానులు నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. అయితే సీక్వెల్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే దానిపై మాత్రం మేకర్స్ ఇప్పటిదాకా ఏం హింట్ ఇవ్వకుండాసైలెన్స్ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.
మరి సలార్ రెండేళ్లు పూర్తయిన సందర్భంగానైనా సీక్వెల్‌పై ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి. సలార్ హిందీ వెర్షన్ టెలివిజన్ ప్రీమియర్- 2024 జాబితాలో 30 మిలియన్లకుపైగా వ్యూయర్స్‌తో టాప్ 3 స్థానంలో నిలిచింది. మరోవైపు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో గత ఎనిమిది నెలల నుంచి టాప్ 10లో ట్రెండింగ్‌లో నిలిచింది.
సలార్ మరోవైపు 2024 జులై 5న జపనీస్ భాషలో విడుదలైంది. సలార్ జపనీస్ వెర్షన్ Hulu Japan లో స్ట్రీమింగ్ అవుతోంది. సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా… జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ , బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రల్లో పోషించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ తెరకెక్కించారు.
2 years ago, a storm was unleashed.
The world witnessed #Salaar in full fury 🔥💥Fuelled by your love, the journey marches on…
The next chapter unfolds with Shouryaanga Parvam. #Salaar2#2YearsForSalaarReign #SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial… pic.twitter.com/XgPEf0ZjIG— Hombale Films (@hombalefilms) December 22, 2025
Mysaa | అగ్రెసివ్‌గా రష్మిక మందన్నా.. మైసా ఫస్ట్ గ్లింప్స్ వచ్చేస్తుంది
Bala Krishna | నార్త్ మార్కెట్లో ఆశలు నెరవేరవా.. బాలకృష్ణకి కూడా నిరాశే ఎదురైందా?