Pawan Kalyan | ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు అభిమానులు కాదు భక్తులే ఉన్నారు. అలాంటి భక్తుల్లో నెంబర్ వన్ బండ్ల గణేశ్. పవన్ గురించి చెప్పమంటే రోజులకు రోజులు చెప్తూనే ఉంటాడు. తనకు గబ్బర్ సింగ్ లాంటి సినిమా ఇచ్చాడని పవన్ కళ్యాణ్‌ను జీవితాంతం దేవుడిని చేశాడు గణేశ్. అలాంటి దేవుడికి ఈ భక్తుడు దూరమవుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతుంది. ఆ భగవంతుడికి ఈ భక్తుడిని దూరం చేసింది మధ్యలో ఒక దర్శకుడు అంటూ ఆ మధ్య బండ్ల గణేశ్ స్వయంగా ఒక ట్వీట్ చేశాడు.
అప్పట్లో అతి పెద్ద దుమారమే రేపింది ఆ ట్వీట్. ఆ దర్శకుడు త్రివిక్రమ్ అని ప్రచారం కూడా జరిగింది. చాలా రోజులుగా పవన్‌కు దూరంగానే ఉన్నాడు బండ్ల గణేశ్. మళ్లీ తన దేవుడితో సినిమా చేస్తానని చాలాసార్లు అనౌన్స్ చేస్తున్నాడు.. కానీ పవన్ డేట్స్ ఇచ్చే మూడ్‌లో లేనట్టు కనిపిస్తున్నాడు. అంతే కాదు రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ వెంట కాకుండా మరో పార్టీలో ఉన్నాడు బండ్ల గణేశ్. దాంతో తన పనుల్లో తాను బిజీ అయిపోయాడు ఈ నిర్మాత. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించే తీరిక కూడా బండ్ల గణేశ్‌కు లేదు. మంచి కథ దొరికినప్పుడు మళ్లీ వరుస సినిమాలు నిర్మిస్తానని చెప్తున్న బండ్ల గణేశ్ ప్రస్తుతానికి తన వ్యాపారంతో బిజీగా ఉన్నాడు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఫంక్షన్ అంటే కచ్చితంగా బండ్ల గణేశ్ అందరికంటే ముందే ఉంటాడు. కానీ మొన్న జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేశ్ కనిపించలేదు.
త్రివిక్రమ్ వస్తే బండ్ల రాడు అని సోషల్ మీడియాలో ప్రచారం బాగానే జరిగింది. కానీ ఆ వేడుకలో త్రివిక్రమ్ కూడా కనిపించలేదు. త్రివిక్రమ్ రాకపోయినా కూడా బండ్ల గణేశ్ రానే లేదు. దీన్నిబట్టి దేవుడితో భక్తుడికి దూరం బాగానే పెరిగింది అనే విషయం అర్థం అవుతుంది. మళ్లీ ఈ దేవుడు భక్తుడు ఎప్పుడు ఒక్కటవుతారనే విషయం కూడా ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ ఒక్కసారైనా పవన్ కళ్యాణ్‌తో మళ్లీ బండ్ల గణేశ్ సినిమా నిర్మిస్తే చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అది జరుగుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అప్పటివరకు ఎదురు చూడటం తప్ప ఇంకేమీ చేయలేము.