Jailer Movie | ఇది సూపర్ ట్విస్ట్ గురూ.. జైలర్, విక్రమ్ స్టోరీలు ఒకటేనా..?
Jailer Movie | రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆగస్టు 10న ఈ సినిమా విడుదల కానుంది. బీస్ట్ తర్వాత నెల్సన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ముఖ్యంగా మన ఆడియో ఫంక్షన్లో నెల్సన్ గురించి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Jailer Movie | రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆగస్టు 10న ఈ సినిమా విడుదల కానుంది. బీస్ట్ తర్వాత నెల్సన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ముఖ్యంగా మన ఆడియో ఫంక్షన్లో నెల్సన్ గురించి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీస్ట్ ఫ్లాప్ అయిన తర్వాత తన సినిమా నుంచి ఆయనను తప్పించాలని చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఫోన్లు చేసి చెప్పారని.. అయినా కూడా నెల్సన్ పై నమ్మకంతో జైలర్ సినిమా చేసినట్టు చెప్పాడు రజనీకాంత్. నిజానికి బీస్ట్ విడుదలకు ముందే జైలర్ సినిమా కన్మార్మ్ అయిపోయింది. దాంతో బీస్ట్ ఫలితంతో పని లేకుండా ఈ సినిమా చేశాడు రజినీ. ఇప్పటి వరకు విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
జైలర్ ట్రైలర్ చూస్తుంటే కచ్చితంగా తమిళంలో ఈ సినిమాకు రికార్డు ఓపెనింగ్స్ వస్తాయి అనిపిస్తుంది. పైగా రజనీకాంత్ కూడా చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలో నటించాడు. ట్రైలర్ మొత్తం రజినీకాంత్ మీదే కట్ చేశారు. అయితే ఇది చూసిన తర్వాత ఎవరికైనా ఒక అనుమానం రాకమానదు. లాస్ట్ ఇయర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా స్టోరీ లైన్.. ఇప్పుడు రజనీకాంత్ నటించిన జైలర్ కథ రెండు ఒకటే అనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా జరుగుతుంది.
విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ ఒక రిటైర్డ్ ఏజెంట్. ఆయన కొడుకు ఒక డ్రగ్ మాఫియా చేతిలో చనిపోతాడు. అప్పుడు మనవడి కోసమే బతుకుతుంటాడు కమల్. అలాగే కొడుకుని చంపిన వాళ్ల మీద పగ తీర్చుకుంటాడు. డ్రగ్ మాఫియాను అంతం చేస్తాడు. ఇప్పుడు జైలర్ కథ దగ్గరికి వస్తే.. ఇందులో కూడా తన మనవడితో కలిసి ఉంటాడు రజనీకాంత్. తన కొడుకు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆ పాత్రను తమిళ నటుడు వసంత్ రవి పోషించాడు ఒక డ్రగ్ మాఫియా కేస్ ఛేదిస్తున్న సమయంలో కొడుకు కనిపించకుండా పోతాడు. అప్పుడు జైలర్‌గా పనిచేసిన తన అనుభవంతో కొడుకుకి ఏమైందో తెలుసుకోవడమే కాకుండా.. ముఠాను మట్టు పెడతాడు రజనీకాంత్. ఈ కథంతా కేవలం ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. ఈ స్టోరీ చూసిన తర్వాత విక్రమ్ సినిమాతో పోలికలు ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే నెల్సన్ దీన్ని పూర్తిగా ఎంటర్టైన్మెంట్ పంథాలో చెప్పినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.
ఒకవైపు యాక్షన్ బాగానే ఉన్నా మరోవైపు కామెడీకి కూడా పెద్దపీట వేశాడు ఈయన. కొలమావి కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలలో కామెడీ హైలెట్‌గా నిలిచింది. దాంతో పాటే యాక్షన్ కూడా ఉంటుంది. తాజాగా జైలర్ సినిమాలో కూడా రెండింటినీ బ్యాలెన్స్ చేశాడు. అయితే స్టోరీ మాత్రం విక్రమ్ తో మ్యాచ్ అవుతుండటం కాస్త కంగారు పుట్టించే విషయం. ఏదేమైనా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమైన కాదా అనేది ఆగస్టు 10న తేలనుంది. తెలుగులో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేస్తున్నారు ఏషియన్ ఫిలిమ్స్.
Read More :
Baby Movie Collections | బేబీ సినిమాకు 100 కోట్లు వస్తాయా.. మేకర్స్ మాస్టర్ ప్లాన్..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

