తెలుగు ఫిలింఇండస్ట్రీలో ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది శృతిహాసన్. క్రాక్, వకీల్‌సాబ్ చిత్రాల సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదుందీ భామ. సోషల్‌మీడియాలో యాక్టివ్గానే ఉండే ఈ బ్యూటీ ట్విటర్ లో అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వేయగా వాటికి తనదైన స్టైల్లో జవాబులిచ్చింది. ఓ అభిమాని మీ వాట్సాప్ నంబర్ ఇవ్వరా అని అడిగితే 100 అని చెప్పింది. 100 అంటూ పోలీస్ కంట్రోల్ రూం నంబర్ చెప్పి ఫన్నీగా స్పందించింది.
తన పేరులో రెండుసార్లు ‘a’ ఎందుకని ఓ ఫ్యాన్ అడుగగా..నాన్న కమల్‌హాసన్ వల్లే అలా పెట్టుకున్నానని చెప్పింది. టాలీవుడ్, కోలీవుడ్ యాక్టర్లతో పనిచేసిన అనుభవాన్ని షేర్ చేసుకుంది. చాటింగ్ ముగించే ముందు మీ అందరు వేసిన ప్రియమైన ప్రశ్నలకు ధన్యవాదాలు. ప్రతీ ఒక్కరికి రిప్లై ఇవ్వలేకపోతున్నా. మీకు మీరు ఎంత ప్రత్యేకమో గుర్తు తెచ్చుకోండి. మాస్క్ పెట్టుకోండి సురక్షితంగా ఉండండి అని ట్వీట్ చేసింది.
ఎక్స్ట్రా రెమ్యునరేషన్ తో పూజాహెగ్డే రిపీట్..!
పవన్ అంటే ఇష్టం..అందుకే విమర్శిస్తా: ప్రకాశ్‌రాజ్
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్