సినీ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి వదలడం లేదు. దీని కారణంగా పలు సినిమాలు వాయిదాలు పడుతున్నాయి. దీనికితోడు ప్రముఖ నటీనటులు కూడా కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కరోనా సోకినట్లు తెలిసింది.
ఇప్పుడు తాజాగా ప్రముఖ నటుడు, ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప కొవిడ్ లక్షణాలతో రాజేంద్ర ప్రసాద్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఇటీవల నటించిన ‘సేనాపతి’ చిత్రం ఆహా ఓటీటీలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ ఒక విభిన్నమైన పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమా చూసి రాజేంద్ర ప్రసాద్ నటనను మెచ్చుకున్న సంగతి తెలిసిందే.