Mohan Lal – Fahadh Faasil | ‘ఎడ మోనే’. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు చూసేవారికి పరిచయం అక్కర్లేని డైలాగ్ అది. మలయాళం నుంచి వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ఆవేశం సినిమాలో హీరో డైలాగ్ ఇది. పుష్ప నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో ఫహాద్ ఫాసిల్ కొట్టిన ఎడ మోనే (ఏరా పిల్లోడా) అనే డైలాగ్ ఫుల్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. మూవీ కంటే ఈ డైలాగ్‌నే ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు ఎక్కువ వాడేశారు.
ఇదిలావుంటే తాజాగా ఈ డైలాగ్‌ను మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫహాద్తోనే రీ క్రియేట్ చేశాడు. తాజాగా ఫహాద్ ఫాసిల్ మోహన్ లాల్‌ని కలవగా.. ఈ సందర్భంలో మోహన్ లాల్ చెంపపై ముద్దు పెట్టాడు ఫహాద్. ఇక ఫహాద్ ఫాసిల్ మోహన్ లాల్‌ని కిస్ చేసిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఎడ మోనే లవ్ యూ అంటూ రాసుకోచ్చాడు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
మోహన్‌లాల్, ఫహద్ ఫాసిల్ కలిసి 2013లో రెడ్ వైన్ అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా అనంతరం వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. తాజాగా మోహన్‌లాల్, ఫహద్ ఫాసిల్ కలిసి మనోరతంగల్ (Manorathangal) అనే ఆంథలాజీ సినిమా చేస్తున్నారు. మోహన్ లాల్, ఫహాద్ ఫాసిల్, మమ్ముట్టిలతో పాటు మొత్తం 8 మంది సూపర్స్టార్లు ఈ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే వీరిద్దరి కలిసినట్లు తెలుస్తుంది.
Eda Mone ! Love you pic.twitter.com/2plElxsybV
— Mohanlal (@Mohanlal) August 11, 2024
Also Read..