Mirzapur 3 | ఇండియన్ మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘మీర్జాపూర్ 3’ (Mirzapur 3) ఓటీటీలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన దీని రెండు భాగాలు రికార్డు స్థాయి వ్యూస్‌తో భారీ ప్రేక్షకాదరణను సొంతం చేసుకోగా.. తాజాగా వచ్చిన మూడో సీజన్ ‘మీర్జాపూర్ 3’ (Mirzapur 3) ఆల్‌టైం రికార్డు వ్యూస్ అందుకుంటున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అయితే సీజన్ 3కి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ ప్రకటించారు మేకర్స్. ఈ సీజన్ 3 అయిపోయిందని అందరూ అనుకుంటుండగా.. తాజాగా ‘మీర్జాపూర్ 3’ బోనస్ ఎపిసోడ్ ఉందని అలీ ఫజల్ ప్రకటించాడు.
ఈ బోనస్ ఎపిసోడ్ మోస్ట్ వైలెంట్‌గా ఉండబోతుందని ఇందులో నేను చంపిన వ్యక్తి కూడా తిరిగిరాబోతున్నాడని అలీ ఫజల్ ప్రకటించాడు. అయితే ఈ బోనస్ ఎపిసోడ్లో చనిపోయిన మున్నా భయ్య మళ్లీ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు. దీనిపై ఒక నెటిజన్ రాసుకోస్తూ.. మున్నా భయ్యా లేకుండా ‘మీర్జాపూర్’ లేదని అందుకే మళ్లీ మున్నాను మేకర్స్ మళ్లీ తీసుకురాబోతున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.
ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. సీజన్ 2 ముగింపులో మున్నా(దివ్యేందు శర్మ) గుడ్డు (అలీ ఫజల్) చేతిలో చనిపోయిన అనంతరం మీర్జాపూర్ సింహాసనం గుడ్డు వశం అవుతుంది. అయితే ఇంతకుముందు ఖాలీన్ (పంకజ్ త్రిపాఠి) చేతిలో ఉన్న మీర్జాపూర్‌ను గుడ్డు ఎలా శాసిస్తాడు. మరోవైపు గుడ్డుని చంపి మీర్జాపూర్‌ను దక్కించుకోవాలని అక్కడి లోకల్ గ్యాంగ్స్ చూస్తుంటాయి. ఈ క్రమంలోనే గుడ్డు ఏం చేశాడు అనేది సీజన్ 3 స్టోరీ. ఈ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి, మాధురీ యాదవ్, విజయ్ వర్మ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్‌కు గుర్మీత్‌సింగ్, ఆనంద్ అయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక త్వరలోనే సీజన్ 4 కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.