Wayanad | తమిళ నటుడు ధనుష్ పెద్ద మనసు చాటుకున్నాడు. వయనాడ్ బాధితులకు ధనుష్ భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళ (Kerala) రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు (Wayanad landslides) విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో ఇప్పటివరకు 400 పైగా మరణించగా.. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో విపత్తులో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు.
ఇప్పటికే సినీ తారలు, పలువురు రాజకీయ నేతలు తమ వంతు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ (Dhanush) కూడా తన వంతుగా విరాళాన్ని ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు అందించనున్నట్లు ఆయన టీమ్ తాజాగా తెలిపింది.
కాగా, ఇప్పటికే పలువురు స్టార్స్ విరాళాలు అందించిన విషయం తెలిసిందే. ప్రభాస్ రూ. 2 కోట్లు ప్రకటించగా.. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు. తమిళంలో విక్రమ్ రూ.20 లక్షలు, హీరో సూర్య ఫ్యామిలీ జ్యోతిక, హీరో కార్తి కలిసి సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలను అందించారు. అదేవిధంగా మలయాళ నటులు మోహన్‌లాల్ రూ.25 లక్షలు, మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిసి రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, రష్మిక ర.10 లక్షలు, స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara), డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) దంపతులు రూ.20 లక్షలను విరాళంగా అందించారు.
Also read..