Pushpa 2 The Rule | మలయాళ నటుడు ఫహద్ ఫజిల్ పుష్ప 2 సినిమాకి డబ్బింగ్ కంప్లీట్ చేశాడు. తన పాత్రకు డబ్బింగ్ పూర్తయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఫహద్ ఫజిల్ ఈ సినిమాలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. మొదటి పార్ట్‌లో కొద్దిసేపు మాత్రమే కనిపించిన ఈ పాత్ర రెండో పార్ట్‌లో అయిన కాస్తా ఎక్కువగా ఉంటుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే రెండో పార్ట్‌కు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశాడు ఫహద్ ఫజిల్.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ & అజయ్ ఘోష్ శ్రీలీల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Fahad Faasil completed dubbing for the #Pushpa2TheRule movie. pic.twitter.com/Q1jZfj2wQj
— Telugu Chitraalu (@TeluguChitraalu) November 15, 2024