Mandaadi | టాలీవుడ్ యాక్టర్ సుహాస్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తోన్న సినిమా మండాడి (Mandaadi). తమిళ నటుడు సూరి మరో లీడ్ రోల్లో నటిస్తున్న ఈ మూవీతో సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. సెల్ఫీ ఫేం మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తీర ప్రాంతం, మత్య్సకారుల నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతోంది. మండాడి సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
మంగళవారం (జులై 14) సాయంత్రం 6 గంటలకు ఎక్జయిటింగ్ అప్డేట్ వచ్చేస్తుందంటూ కొత్త లుక్ ఒకటి షేర్ చేశారు. తీరంలోని ఇసుక తిన్నెల్లో తెరచాప నావ ఉన్న లుక్ క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఇంతకీ ఆ వార్త ఏంటనేది తెలియాలంటే రేపటి దాకా వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రంలో సుహాస్ సాట్టపులి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలియజేస్తూ ఇప్పటికే మేకింగ్ వీడియో విడుదల చేశారు. సుహాస్ లాంగ్ హెయిర్, స్టైలిష్ గాగుల్స్‌తో సిగరెట్ వెలిగిస్తూ లుక్‌తో రిలీజ్ చేసిన వీడియోలో ఇదివరకెన్నడూ లేని విధంగా తనలోని విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. మండాడి సినిమాతో సుహాస్ సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.
ఈ మూవీలో మహిమా నంబియార్ కీలక పాత్రలో నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ తెరకెక్కిస్తోంది.
Something exciting is on the way 🥶
Stay tuned for the next update from #Mandaadi, tomorrow at 6 PM ⛵❤️🔥@sooriofficial #Suhas @elredkumar @rsinfotainment @MathiMaaran @gvprakash @Mahima_Nambiar @RavindraVijay1 @MithunJS5 #sathyaraj @bala_actor @PeterHeinOffl @dhilipaction… pic.twitter.com/Dm59taU2Z8
— BA Raju’s Team (@baraju_SuperHit) July 13, 2026