నూతన నటీనటులు, సీనియర్ యాక్టర్స్‌తో కలిసి దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. భూమిక, సారా అర్జున్, నాసర్, రోహిత్ తదితరులు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా బుధవారం స్పెషల్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
‘సమకాలీన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలకు దర్పణంలా ఉంటుంది. భూమిక పాత్ర భావోద్వేగాలతో సాగుతుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, నిర్మాత: నీలిమా గుణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గుణశేఖర్.