ETV Win Subscription | మూవీ లవర్స్‌కు ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.29 లకే ఈటీవీ విన్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ.. మీ రోజువారి సామాన్లకంటే తక్కువ ధరలో కేవలం రూ. 29లకే ఈటీవీ విన్ చూసి ఎంజాయ్ చేయండి అంటూ రాసుకోచ్చింది.
ఈటీవీ 29వ వార్షికోత్సవం సందర్భంగా రూ.99 కలిగిన నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను రూ.29కే అందించబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఆగష్టు 28 నుంచి 29 తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇక ఈటీవీ విన్లో ‘వీరాంజనేయులు విహారయాత్ర’తో పాటు 400లకు పైగా కల్ట్ క్లాసిక్ మూవీలు ఉన్నట్లు వెల్లడించింది.
🚨 Special Deal Alert!🚨
Get @etvwin Monthly Subscription for ₹29!
మీ రోజువారి సామాన్లకంటే తక్కువ ధరలోOFFER VALID ONLY ON 28th & 29th OF AUGUST #EtvWin #WinThoWinodham pic.twitter.com/zGDH6XDLR3
— ETV Win (@etvwin) August 28, 2024
Also Read..