Amaravathi Aahwanam | థ్రిల్లర్ జోనర్లో వచ్చే సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని తెలిసిందే. ఇదే జోనర్లో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తుంది అమరావతికి ఆహ్వానం (Amaravathiki Aahwanam). సీట్ ఎడ్జ్ హార్రర్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి జీవీకే దర్శకత్వం వహిస్తున్నాడు.
ఎస్తర్, ధన్యబాలకృష్ణ, శివ కంఠమనేని, సుప్రిత, హరీష్, అశోక్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ నుంచి ఉగాది సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్లో లీడ్ యాక్టర్ల ముఖాలను పూర్తిగా రివీల్ చేయకుండా డార్క్ షేడ్స్‌లో కనిపించడం చూడొచ్చు. లీడ్ క్యారెక్టర్లంతా బ్లాక్ డ్రెస్‌లో సీరియస్‌గా కనిపిస్తున్నారు.
డైరెక్టర్ ఏదో ఒక కొత్త అంశాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్టు తాజా లుక్ చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రాన్ని లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు.
Celebrating #Ugadi with a thrilling twist! Unveiling the first look of #AmaravathiAahwanam pic.twitter.com/g7akLSW2d9
— Vamsi Kaka (@vamsikaka) March 30, 2025
Prabhas Spirit | మెక్సికోలో షూటింగ్.. ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ పంచుకున్న సందీప్ వంగా
Lucifer 2 Empuraan | మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాపై 17 సెన్సార్ కట్స్
Pawan Kalyan | ఉగాది రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. ఇక సమయం లేదు మిత్రమా..!