Esha Deol recalls slapping | కేరళ ప్రభుత్వం హేమ కమిటీ రిపోర్ట్ బయటపెట్టిన అనంతరం నుంచి పలు ఇండస్ట్రీల నుంచి మేము కుడా వేధింపులు ఎదుర్కొన్నట్లు హీరోయిన్లు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ ఎంపీ హేమ మాలిని కూతురు నటి ఈషా డియోల్ కూడా వేధింపులను ఎదుర్కొన్నట్లు తెలిపింది. అయితే ఆ ఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించానని తెలిపింది. మహిళలు కూడా వేధింపులు జరిగినప్పుడు తప్పకుండా స్పందించాలని వెల్లడించింది.
2005లో వచ్చిన దాస్ అనే సినిమా ఈవెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వేడుక పుణెలో జరుగగా.. సినిమాలో నటించిన వారితో కలిసి ఆ ఈవెంట్కు వెళ్లాను. అయితే మమ్మల్ని చూసేందుకు జనాలు చాలామంది వచ్చారు. వారికి కంట్రోల్ చేయడానికి బౌన్సర్లు కూడా ఉన్నారు. అయితే మేము వేడుక జరుగుతున్న హాల్లోకి వెళుతుండగా.. ఒక వ్యక్తి నన్ను అసభ్యకరంగా తాకాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే అతడిని బయటకు లాగి చెంపమీదా గట్టిగా కొట్టాను. అక్కడ ఉన్నవాళ్లంతా షాక్ అయ్యారు. ఈ విషయం తరువాత సద్దుమణిగింది. సాధారణంగా నేను చాలా ఓపికతో ఉంటాను. కానీ నేను అలా ఉంటున్నాను కాబట్టి ఏం చేయదు అనుకోవద్దు. నా సహనాన్ని పరీక్షిస్తూ ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే తప్పకుండా వారికి గట్టి సమాధానమిస్తా. అలాగే మహిళలు కూడా ఘటన జరిగినప్పుడే స్పందించాలి అంటూ ఈషా డియోల్ చెప్పుకోచ్చింది.
Also Read..