ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్చేశా

‘చాలా రోజుల తర్వాత నేను చేసిన మాస్ సినిమా ఇది. హీరోననే ఫీలింగ్‌ను మరచిపోయి థియేటర్లో సినిమాను ఎంజాయ్చేశా’ అని అన్నారు కార్తి. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సుల్తాన్’. బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది.
ఈ సందర్భంగా కార్తి మాట్లాడుతూ ‘కుటుంబ ప్రేక్షకులు సినిమాను చక్కగా ఆదరిస్తున్నారు. కరోనా భయాలు నెలకొన్నా సినిమా చూడటానికి థియేటర్లకు వస్తుండటం ఆనందంగా ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. వంద మంది అన్నయ్యలు ఉన్న తమ్ముడి కథను వినోదాత్మక పంథాలో చక్కగా చూపించామని చెబుతున్నారు. వల్గారిటీ లేకుండా తెరకెక్కించిన ప్రేమకథ గా ఆకట్టుకుంటుంది. రౌడీలను మార్చే సందేశానికి వ్యవసాయం ఔన్నత్యాన్ని జోడించి అర్థవంతంగా చూపించామని ప్రశంసిస్తున్నారు’ అని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను విజయవంతం చేయడం సంతోషంగా ఉందని నిర్మాత ఎస్.ఆర్ ప్రభు చెప్పారు. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయని దర్శకుడు బక్కియరాజ్ కణ్ణన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

