మహిళల త్యాగాలకు గుర్తింపు ఇది

‘ప్రజల హక్కుల కోసం పోరాడే లాయర్లు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్ర నాకు ‘వకీల్‌సాబ్’తో దొరికింది. ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నారు పవన్‌కల్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వకీల్‌సాబ్’. శ్రీరామ్ వేణు దర్శకుడు. బోనీకపూర్ సమర్పణలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. శృతిహాసన్, అంజలి, నివేధా థామస్, అనన్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 9న విడుదలకానుంది.
ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ‘తెలుగు చిత్రసీమలో నిర్మాతగా గొప్ప స్థానానికి చేరుకున్న దిల్‌రాజుతో కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. ‘తొలిప్రేమ’ నుంచి నాకు ఆయన అండగా నిలబడ్డారు. మేమిద్దరం కలిసి సినిమా చేయాలన్న కల ఈ సినిమాతో తీరింది. నా దృష్టిలో సినిమా చాలా విశిష్టమైనది. బలమైన మాధ్యమం. సినిమా ద్వారా సామాజిక స్పృహ కోసం పాటుపడాలని అనుకుంటా. అందుకే స్త్రీలను కించపరిచే సన్నివేశాల్లో నటించను. అందరికి ఆమోదయోగ్యమైన కథల్ని ఎంచుకుంటూ కుటుంబంతో కలిసి చూసే సినిమాల్నే చేయాలని అనుకుంటా. నేను పూజించే స్త్రీశక్త్తిని గౌరవించే అవకాశం ఈ సినిమాతో దొరికింది. మహిళలు చేస్తున్న త్యాగాలకు గుర్తింపుగా ఈ సినిమా ఉంటుంది. స్త్రీని గౌరవించాలని చాటిచెప్పే చిత్రమిది. నా కెరీర్లో ఎక్కువ కష్టపడి ఈ సినిమా చేశా’ అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ‘పవన్‌కల్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ చిత్రానికి నేను డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాను. అప్పటి నుంచి పవన్‌కల్యాణ్‌తో నాకు భావోద్వేగభరితమైన బంధం మొదలైంది. ఆ సినిమా వందరోజుల వేడుక సంధ్య థియేటర్లో జరిగినప్పుడు రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. అప్పుడు వచ్చిన జనసందోహాన్ని చూసి..ఒకవేళ నిర్మాతగా మారితే పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయాలనుకున్నా. ఆ తర్వాత అనేక ప్రయత్నాలు జరిగినా ఎందుకనో సినిమా చేయడం కుదరలేదు. తెలుగు పరిశ్రమలోని స్టార్‌హీరోలందరితో సినిమాలు చేశాం. పవన్‌కల్యాణ్‌తో సినిమా బాకీగా మిగిలిపోయింది. ఆ అవకాశం ‘పింక్’ రీమేక్ రూపంలో వచ్చింది. తమిళంలో అజిత్ చేసిన ‘పింక్’ రీమేక్ సినిమా చూసినప్పుడు నేను తెరపై పవన్‌కల్యాణ్‌నే ఊహించుకున్నాను. బోనీకపూర్, హరీష్‌శంకర్, త్రివిక్రమ్ ఈ సినిమా కల సాకారం కావడానికి నాకు తోడ్పాటునందించారు. వారందరికి కృతజతలు.
ఏప్రిల్ 9న మనమంతా పండగ చేసుకొని, కాలర్ ఎగరేసే రోజు. పవన్‌కల్యాణ్‌తో ఇరగదీసే సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ మధ్య నేను పవన్‌కల్యాణ్‌ను పర్సనల్‌గా కలిసిప్పుడు ఆయన రెండు మాటలు చెప్పారు. వాటిని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’ అన్నారు. దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ ‘పవన్‌కల్యాణ్ అభిమానిగా ఆయన సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్చేశా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

