నవీన్‌చంద్ర ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఎలెవన్’. లోకేశ్ అజ్ల్స్ దర్శకుడు. రేయా హరి కథానాయికగా నటిస్తూ అజ్మల్ఖాన్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తోంది. మే 16న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు ప్రమోషన్స్ విషయంలో దూకుడు పెంచారు.
ఆద్యంతం ఉత్కఠను రేకెత్తించే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇదని, సగటు ప్రేక్షకునికి కావాల్సిన అంశాలన్నీ ఈ కథలో ఉంటాయని మేకర్స్ తెలిపారు. రుచిర ఎంటైర్టెన్మెంట్స్ ద్వారా ప్రముఖ పంపిణీదారుడు ఎన్.సుధాకర్‌రెడ్డి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు, ఇందులో కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ అశోకన్, సంగీతం: డి.ఇమ్మాన్.