Eesha Trailer | హార్రర్ థ్రిల్లర్‌కి దేశంలో ఎప్పుడూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా రొటీన్ దెయ్యం డ్రామాలకన్నా, కొత్త పాయింట్, కొంత లాజిక్, సైంటిఫిక్ యాంగిల్ కలిపిన హార్రర్ సినిమాలు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నంతో వస్తున్న చిత్రం ‘ఈషా’. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌ను సృష్టించింది.ట్రైలర్ చూస్తే, ఇది సాధారణ దెయ్యం కథ కాదని స్పష్టమవుతోంది.దెయ్యాలు లేవని నమ్మే స్నేహితుల గ్రూప్,సమాజంలో ఉన్న బోగస్ బాబాలను ఎక్స్పోజ్ చేయాలనే మిషన్, బబ్లూ పృథ్వీరాజ్ “ఆత్మలు ఉన్నాయని నిరూపించండి” అని ఛాలెంజ్ విసరడంతో కథ ఓ డార్క్ జోన్లోకి అడుగుపెడుతుంది.
సైన్స్ vs అతీంద్రియ శక్తుల మధ్య జరిగే పోరు ఈ సినిమాకి ప్రధాన బలం అని అనిపిస్తోంది.ట్రైలర్ విజువల్స్- డార్క్ టోన్‌లో ఆసక్తికరమైన సెటప్, ట్రైలర్ మొత్తం బ్లూ & డార్క్ థీమ్‌లో సాగుతుంది. పాడుబడిన బంగ్లా,నేలపై వేసిన యంత్రాలు, క్షుద్ర పూజల సెటప్స్… ఈ లొకేషన్స్ సినిమాలోని హార్రర్ మూడ్‌ని బాగా ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రాఫర్ సంతోష్ లైటింగ్, ఆర్ఆర్ ధృవన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇచ్చాయి. ఈషాలో ఇటీవలే రాజు వెడ్స్ రాంబాయి తో హిట్ కొట్టిన అఖిల్ రాజ్ కూడా ఇందులో నటిస్తున్నాడు. త్రిగున్, హెబ్బా పటేల్, సిరి హన్మంత్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.
ట్రైలర్లో భయంతో వణికే సన్నివేశాల్లో వారి నటన సహజంగా ఉంది, హెబ్బా పటేల్‌కు దెయ్యం పట్టే సన్నివేశాలు గ్రిప్పింగ్‌గా ఉన్నాయి, గ్లామర్కంటే కథలో ఉన్న పాత్ర ప్రాముఖ్యతకే ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ చిత్రంలోని ప్రధాన బలం బన్నీ వాస్, వంశీ నందిపాటి చిత్రం రిలీజ్ చేస్తుండటం. వారు రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో ఈ సినిమాపై నమ్మకం పెరిగింది. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను తరచూ ప్రొత్సహించే వీరు ‘ఈషా’కి పట్టం కట్టడం, కథలో ఏదో ప్రత్యేకత ఉందని సూచిస్తోంది. HVR ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రొడక్షన్ వ్యాల్యూస్ డీసెంట్‌గా ఉన్నాయి. ట్రైలర్ చివర్లో వచ్చే ఫాస్ట్ కట్స్, సడెన్ ట్విస్టులు, హై టెన్షన్ మ్యూజిక్ సినిమాపై మంచి క్యూరియాసిటీని రేపాయి. ఓవర్ హైప్ లేకుండా, లాజిక్‌తో వచ్చిన పక్కా హార్రర్ థ్రిల్లర్‌ను చూడాలనుకునే ప్రేక్షకులకు ‘ఈషా’ మంచి ఆప్షన్ కావొచ్చు. ప్రత్యేకంగా థియేటర్లలో సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఈ దెయ్యం కథ ఎంత భయపెడుతుందో… డిసెంబర్ 12న తెలుస్తుంది.