రవితేజ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ చిత్రంలోని పాటను మేకర్స్ విడుదల చేశారు. కల్యాణచక్రవర్తి సాహిత్యంతో ‘ఆడు మచ్చా..’ అంటూ సాగే ఈ పాటను డేవ్ జాంద్ స్వరపరచగా, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
గ్రామీణ వేడుకలకు అద్దంపట్టే ఊర మాస్ ఆంథమ్‌గా ఈ పాట ఉంటుందని, ఇందులో రవితేజ గెటప్, డ్రస్సింగ్ ైస్టెల్ విభిన్నంగా మాస్ మెచ్చేలా ఉంటాయని, నల్లచొక్కా, ధోతీ ధరించి, మెడలో రుద్రాక్షమాలతో పూర్తిగా రవితేజ కొత్త అవతారం ఈ పాటలో చూస్తారని మేకర్స్ చెపుతున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా ఉంటుందని వారు చెబుతున్నారు. అనుపమా పరమేశ్వరన్, కావ్య థాపర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, మధుబాల ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: మణిబాబు కరణం, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, కమిల్ ప్లాకి, కర్మ్ చావ్లా.