అషికా రంగనాథ్, ఎస్ఎస్ దుశ్యంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కన్నడ ఫాంటసీ డ్రామా ‘గత వైభవ’. సింపుల్ సుని దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 14న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సోమవారం టీజర్‌ను విడుదల చేశారు. చరిత్ర, పురాణాల నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా సాగింది. నాయకానాయికల పర్ఫార్మెన్స్ ప్రధానాకర్షణగా నిలిచింది.
భారతీయ పురాణాల ఆధారంగా తయారుచేసుకున్న వినూత్నమైన కథ ఇదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి జూదా సాంధి సంగీత దర్శకుడు. ‘నా సామిరంగా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది కన్నడ భామ అషికా రంగనాథ్. ప్రస్తుతం ఆమె తెలుగులో చిరంజీవి సరసన ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.