ప్రతీ సినిమాకు వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మలయాళీ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్. ఆయన నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాదినేని దర్శకుడు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తున్నది. అగ్ర నాయిక శృతిహాసన్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నది. బుధవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
కథాగమనంలో చాలా ప్రాధాన్యం కలిగిన పాత్ర ఆమెదని, కొంతకాలంగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న శృతిహాసన్‌కు కథ బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌లో భాగమైందని మేకర్స్ తెలిపారు. వ్యోయగామి కావాలని కలలు కనే ఓ గ్రామీణ యువతి ఆశయాన్ని కథానాయకుడు ఎలా నెరవేర్చాడు? ఈ క్రమంలో వారి ప్రయాణంలోని మలుపులు ఆసక్తికరంగా ఉంటాయని, స్ఫూర్తినిచ్చే కథగా ఆకట్టుకుంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ వేసవిలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్, దర్శకత్వం: పవన్ సాదినేని.