ఇప్పుడు తెలుగులో నాని టైమ్ నడుస్తున్నది. హీరోగా వరుస బ్లాక్‌బస్టర్స్‌తో సత్తాచాటుతూనే..మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఇక దుల్కర్సల్మాన్ దక్షిణాదిలోనే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. మలయాళంతో పాటు తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం దుల్కర్ సల్మాన్‌తో నాని తన ప్రొడక్షన్లో ఓ సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
‘కోర్ట్’ చిత్ర దర్శకుడు రామ్ జగదీష్ డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ సినిమాకు ఓకే చేశారని ఫిల్మ్‌నగర్ వార్త. వీరిద్దరి కాంబో కార్యరూపం దాల్చితే మరో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమని అభిమానులు అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం నాని..శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హైదరాబాద్ నేపథ్య పీరియాడిక్ చిత్రం ‘ప్యారడైజ్’లో నటిస్తున్నారు. ఇక దుల్కర్ సల్మాన్ తమిళంలో ‘కాంత’, మలయాళంలో ‘ఐయామ్ గేమ్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.