Dulquer Salmaan | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని వివిధ భాషల్లో తమకంటూ సెఫరేటు ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న స్టార్ యాక్టర్లలో టాప్‌లో ఉంటారు టాలీవుడ్ యాక్టర్లు రాంచరణ్, నాని, మాలీవుడ్ యాక్టర్ దుల్కర్ సల్మాన్. యాక్టింగ్‌కు సంబంధించి ఈ ముగ్గురిలో ఎవరి స్టైల్ వారిదే.. ఈ స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బరిలోకి దిగితే ఎలా ఉంటుంది. అవును ఇప్పుడు ఆ వార్తే ఒకటి ఫిలింనగర్ సర్కిల్ లో రౌండప్ చేస్తోంది.
దుల్కర్ సల్మాన్ నటించిన కాంత రేపు ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసిందే. దుల్కర్ సల్మాన్ మరోవైపు పవన్ సాదినేని డైరెక్షన్లో ఆకాశంలో ఒక తార సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా రాంచరణ్, నాని ప్రాజెక్టులతో కలిసి 2026లో విడుదల కానుందంటూ వార్త మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది.
నాని నటిస్తోన్న చిత్రం ది ప్యారడైజ్. ఈ మూవీ శ్రీరామ నవమి కానుకగా 2026 మార్చి 26న థియేటర్లలోకి రానుంది. రాంచరణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం పెద్ది. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజా టాక్ ప్రకారం దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న ఆకాశంలో ఒక తార కూడా ఇదే సీజన్లో విడుదలకు రెడీ అవుతుందట.
ఒకవేళ ఇదే నిజమైతే రాంచరణ్, నాని నుంచి దుల్కర్ సల్మాన్‌కు గట్టి పోటీ ఉండబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆకాశంలో ఒక తార చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తుండగా.. శృతిహాసన్ కీలక పాత్రలో నటిస్తోంది. లైట్ బాక్స్, స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ లాంటి లీడింగ్ బ్యానర్లపై తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Ram Gopal Varma | చాలా కాలం తర్వాత నిజమైన రాంచరణ్‌ను చూశా.. చికిరి చికిరి సాంగ్‌పై రాంగోపాల్ వర్మ