ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) హీరోగా వచ్చిన అంధాధున్ (Andhadhun) చిత్రం బాక్సాపీస్‌ను ఏ రేంజ్లో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంధుడిగా ఆయుష్మాన్ నటనకు ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు. బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది అంధాధున్. ఈ చిత్రంలో ఉత్తమ నటనకుగాను ఆయుష్మాన్ నేషనల్ అవార్డు అందుకున్నాడు. కొన్ని సినిమాలు ఒక యాక్టర్ చేతుల్లో నుంచి వెళ్లిపోయి మరో హీరోకు ప్లస్ అవడం సాధారణంగా చూస్తుంటాం. శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్లో వచ్చిన అంధాధున్ విషయంలో కూడా అదే జరిగింది.
ఆయుష్మాన్ ఖురానా కంటే ముందు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan) అంధాధున్‌లో హీరోగా ఉండాల్సిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు దుల్కర్ సల్మాన్. తప్పుడు సమాచారం వల్ల తాను అంధాధున్ చేసే అవకాశాన్ని కోల్పోయినట్టు దుల్కర్ చెప్పుకొచ్చాడు. అంధాధున్ చిత్రాన్ని తెలుగు, మలయాళంలో కూడీ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ రీమేక్ కూడా త్వరలోనే థియేటర్లలో విడుదలయేందుకు సిద్దమవుతుంది.
దుల్కర్ సల్మార్ ప్రస్తుతం కురూప్ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 12న విడుదల కానుంది కురూప్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
AR Rahman | రజనీకాంత్ సినిమాలకు పనిచేయడం నరకం: ఏఆర్ రెహమాన్
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా