మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు హీరో అయిపోయారు దుల్కర్ సల్మాన్. మలయాళంతో సమానంగా తెలుగులోనూ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారాయన. ప్రస్తుతం దుల్కర్ చేస్తున్న తెలుగు సినిమా ‘లక్కీభాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 80శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 7న విడుదల చేయాలని నిర్మాతలు మొదట్లో భావించారు. అయితే.. ఇప్పుడు అక్టోబర్ 31న దీపావళి కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు. మంగళవారం దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. పోస్ట్ ప్రొడక్షన్‌కి అదనపు సమయం పడుతుందని, అందుకే విడుదల తేదీని మార్చాల్సి వచ్చిందని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్న ఉద్దేశంతోనే విడుదలను మరో నెలరోజులు వాయిదా వేశామని, కళాదర్శకుడు బంగ్లాన్ నిర్మించిన 80ల నాటి ముంబై సెట్, నిమిష్ రవి కెమెరా పనితనం, నవీన్నూలీ ఎడిటింగ్ ఈ సినిమాకు హైలైట్స్‌గా నిలువనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.