ఓటీటీకే క్యూ కడుతున్న క్రేజీ సినిమాలు
కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు ఈ మధ్యే మళ్లీ తెరుచుకున్నాయి. అయినా కూడా మన నిర్మాతలకు వాటిపై నమ్మకం కుదరడం లేదు. అందుకే థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా సినిమాల విడుదల తేదీలు అనౌన్స్ చేయడం లేదు.

కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు ఈ మధ్యే మళ్లీ తెరుచుకున్నాయి. అయినా కూడా మన నిర్మాతలకు వాటిపై నమ్మకం కుదరడం లేదు. అందుకే థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా సినిమాల విడుదల తేదీలు అనౌన్స్ చేయడం లేదు. సరికదా.. ఇప్పుడు కొన్ని సినిమాలను ఓటీటీలోనే విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు. పైగా మంచి రేట్ కూడా ఇస్తుండటంతో నిర్మాతలు కూడా అటు వైపు అడుగులు వేస్తున్నారు. తమ సినిమాలు థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్ అయి వసూలు చేసే మొత్తం కంటే కూడా ఓటీటీ సంస్థలు టెంప్టింగ్ ఆఫర్స్ ఇస్తున్నాయి. దాంతో ఓటీటీ వైపు వెళ్లేందుకు చాలా సినిమాలు చూస్తున్నాయి. ఇప్పటికే వెంకటేష్ నటించిన నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో మరిన్ని సినిమాలు కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఆ సినిమాలేంటో.. వాటికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి వస్తున్న ఆఫర్లు ఏంటో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి ఒక అంచనా.
| సినిమా | ఓటీటీ ప్లాట్‌ఫామ్ | డీల్ |
| వెంకటేశ్ దృశ్యం 2 | డిస్నీ హాట్ స్టార్ | 36 కోట్ల డీల్ |
| నితిన్ మాస్ట్రో | డిస్నీ హాట్ స్టార్ | 28 కోట్లు |
| నాని టక్ జగదీష్ | అమెజాన్ ప్రైమ్ వీడియో | 37 కోట్లు |
| గోపీచంద్ సీటీమార్ | అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు | 16 కోట్లు అంచనా |
| శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ | నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌తో చర్చలు | 39 కోట్లు |
| శర్వానంద్ మహా సముద్రం | నెట్ ఫ్లిక్స్ చర్చలు | 21 కోట్లు |
ఇవి మాత్రమే కాదు.. మరో అరడజన్ సినిమాల వరకు కూడా ఓటీటీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోడానికి సిద్ధమైనట్లు ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇఫ్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ ఎలాగూ పునర్వైభవం తెచ్చుకోడానికి ఇంకా టైమ్ పడుతుంది. అందుకే అప్పటి వరకు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను ఆపకుండా.. ఓటీటీకే ఇచ్చేయాలని చూస్తున్నారు నిర్మాతలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
God father |చిరంజీవిని సంపత్ నంది కలవడానికి అసలు కారణం అదేనా..?
చిరంజీవి లూసిఫర్ రీమేక్‌లో విలన్‌గా సత్యదేవ్ ?
రోడ్డుపై స్నానం చేసి షాకిచ్చిన బాలీవుడ్ నటుడు
చిన్మయిని రేప్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులు
‘మా’లో లొల్లి.. కుర్చీ దిగకూడదని నరేశ్ ప్రయత్నాలు: నటి హేమ
అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్‌ల్లోనూ హీరోయిన్ల హవా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Love story
- mahasamudram
- mastr
- ott
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

