Double iSmart | మాస్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ మరికొన్ని గంటల్లోనే (ఆగస్టు 15న) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా పూరీ టీం మేకింగ్ వీడియోను విడుదల చేసింది.
రామ్ నుంచి అభిమానులు ఆశించే ఫన్, యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఎలిమెంట్స్‌తో స్టైలిష్‌గా తెరకెక్కించినట్టు మేకింగ్ వీడియో క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ విజువల్స్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి. ఈ మూవీలో గన్స్, రౌడీలతో స్టైలిష్ యాక్షన్ పార్టు ఉండబోతున్నట్టు ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్న బీటీఎస్ స్టిల్స్ చెబుతున్నాయి.
ఈ చిత్రాన్ని నైజాంలో ప్రైమ్ షో ఫిలిమ్స్ విడుదల చేస్తుండగా.. తమిళనాడులో పాపులర్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ శక్తి ఫిలిం ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా.. షాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది.
డబుల్ ఇస్మార్ట్ మేకింగ్ వీడియో..
Here’s #DoubleiSmart Making Video 💥
GRAND RELEASE TOMORROW❤️🔥#DoubleiSmartFromTomorrow
— BA Raju’s Team (@baraju_SuperHit) August 14, 2024
Venkatesh | మాజీ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ బ్యాక్ టు యాక్షన్.. SVC58 క్రేజీ న్యూస్
Double iSmart | డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో యాక్షన్ పార్ట్.. రామ్ ప్రాక్టీస్ సెషన్ చూశారా..?
Ravi Teja | సుమ, భాగ్య వీళ్లే ఫొటో తీయండి.. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో రవితేజ