Don Bosco | ‘డాన్ బోస్కో’ పేరుతో ఓ కామెడీ నేపథ్య చిత్రం తెరకెక్కుతున్నది. పి.శంకర్గౌరి దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ), ముప్పనేని శైలేష్రామ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి కెమెరా స్విచాన్ చేయగా, చుక్కపల్లి సురేష్ క్లాప్ ఇచ్చారు. చిన్నబాబు స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందించారు. ఈ సందర్భంగా టైటిల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
‘వెల్కమ్ టు ది క్లాస్ రీయూనియన్-బ్యాచ్ 2014’, ‘అన్ని రీ యూనియన్లు జ్ఞాపకాల కోసం కాదు.. కొన్ని విముక్తికి సంబంధించినవి..’ అంటూ పోస్టర్‌పై రాసిన క్యాప్షన్స్ సినిమాపై కథపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రిన్సిపల్ విశ్వనాథ్‌గా మురళీశర్మ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారని, లెక్చరర్ సుమతిగా మిర్నా మీనన్ కనిపిస్తారని, మౌనిక, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, విష్ణు ఓయ్ పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎదురోలు రాజు, సంగీతం: మార్క్ కె.రాబిన్, నిర్మాణం: లౌక్య ఎంటైర్టెన్మెంట్స్, శ్రీమాయ ఎంటైర్టెన్మెంట్స్.