e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News సీటీమార్ సాంగ్ కు డాక్ట‌ర్ల స్టెప్పులు : నెటిజ‌న్లు ఫిదా

సీటీమార్ సాంగ్ కు డాక్ట‌ర్ల స్టెప్పులు : నెటిజ‌న్లు ఫిదా

సీటీమార్ సాంగ్ కు డాక్ట‌ర్ల స్టెప్పులు : నెటిజ‌న్లు ఫిదా

ముంబై : బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్, హాట్ బ్యూటీ దిశా ప‌టానీ జోడీగా తెర‌కెక్కిన రాథే మూవీ ఈద్ సంద‌ర్భంగా ఓటీటీలో విడుద‌లై సందడి చేస్తోంది. ఈ సినిమాపై విశ్లేష‌కులు పెద‌వివిరిచినా రాథే నుంచి సీటీమార్ సాంగ్ ఆకట్టుకుంటోంది. క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తి దేశాన్ని వ‌ణికిస్తుండ‌గా రోగుల‌కు చికిత్స అందిస్తూ అల‌సిన వైద్యులు ఈ పాట‌కు డ్యాన్స్ ల‌తో అద‌ర‌గొట్టి సేద తీరిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

దిశా ప‌టానీ ఫ్యాన్ పేజ్ టీమ్ దిశ ప‌టానీ ఈ క్లిప్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో క్లిప్ కు నెటిజ‌న్ల నుంచి భారీ స్పంద‌న వ‌స్తోంది. ఇన్ స్టాలో ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వీడియో 14,346 వ్యూస్ రాగా, ఇత‌ర సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పైనా షేర్ చేశారు. ఈ పాట‌కు అనుగుణంగా డాక్ట‌ర్ల డ్యాన్స్ కు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. వైద్యుల నిస్వార్ద సేవ‌ను నెటిజ‌న్లు కొనియాడారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సీటీమార్ సాంగ్ కు డాక్ట‌ర్ల స్టెప్పులు : నెటిజ‌న్లు ఫిదా

ట్రెండింగ్‌

Advertisement