బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) సూపర్ హిట్ కాంబోలో వస్తున్న చిత్రం అఖండ (Akhanda). మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ (Srikanth) పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. డిసెంబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Akhanda pre release function)ను నవంబర్ 27న శిల్ప కళావేదికలో ఏర్పాటు చేశారు. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఎవరొస్తున్నారనే దానిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అఖండ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా హాజరవబోతున్నాడు. బాలకృష్ణ, అల్లు అర్జున్ను ఒకే వేదికపై చూడనుండటంతో నందమూరి ఫ్యాన్స్ కు, బన్నీ అభిమానులు ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు. ఇప్పటికే ఎస్ థమన్ కంపోజిషన్ లో విడుదలైన రెండు పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది.
ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాలకృష్ణలోని మాస్ యాంగిల్ బోయపాటి మరోసారి ఆడియెన్స్ రుచి చూపించబోతున్నట్టు ట్రైలర్‌తో తెలిసిపోతుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్. అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సరైనోడు మంచి టాక్ తెచ్చుకన్న సంగతి తెలిసిందే.
ఇది కూడా చూడండి
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!