Mana Shankara Varaprasad Garu | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం మన శంకర వర ప్రసాద్‌గారు (Mana Shankara Varaprasad Garu). ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తిక వార్త ఒకటి బయటకు వచ్చింది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి టీం చిరంజీవిపై వచ్చే ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ సీక్వెన్స్ ఫిలింనగర్ గోల్ఫ్ కోర్ట్ నేడు షురూ కాగా.. మరో రెండు రోజుల పాటు షూటింగ్ కొనసాగనుందట. ఈ షెడ్యూల్‌తో చిరంజీవికి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి కానుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే విడుదల చేసిన మీసాల పిల్ల సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
ఈ మూవీలో వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల (సంక్రాంతికి వస్తున్నాం) ఫేం బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా.. రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Ram Gopal Varma | చాలా కాలం తర్వాత నిజమైన రాంచరణ్‌ను చూశా.. చికిరి చికిరి సాంగ్‌పై రాంగోపాల్ వర్మ