కరోనా కారణంగా కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు.. అన్ని ఇండస్ట్రీలు దారుణంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ అయితే రూ.4 వేల కోట్లు నష్టపోయిందని ఒక అంచనా. తమిళ ఇండస్ట్రీకి సైతం దాదాపు రూ.1000 కోట్లు నష్టాలు వచ్చినట్లు ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక టాలీవుడ్ ( Tollywood ) విషయానికి వస్తే దాదాపు రూ.1200 కోట్ల వరకు నష్టం వచ్చిందని సీనియర్ నిర్మాతల నుంచి వస్తున్న సమాచారం. కేవలం సమ్మర్ సీజన్లో టాలీవుడ్ ( Tollywood )లో దాదాపు రూ.1000 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా. కానీ లాక్డౌన్ కారణంగా 2020 వేసవి సీజన్ మొత్తం థియేటర్లు మూతపడటంతో తెలుగు ఇండస్ట్రీ దారుణంగా నష్టపోయింది. ఇక 2021లోనూ పరిస్థితి మారలేదు. సెకండ్ వేవ్ కారణంగా మరోసారి థియేటర్లు బంద్ కావడంతో చాలా సినిమాలు విడుదల తేదీని కన్ఫార్మ్ చేసుకుని కూడా చివరి నిమిషంలో తేదీ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు సమ్మర్ సీజన్ పీక్స్‌లో ఉంటుంది. ఈ సీజన్లో చాలా సినిమాలు విడుదల అవుతుంటాయి. ఈసారి కూడా లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాట పర్వం, ఆచార్య, ఖిలాడి, అఖండ, రాధే శ్యామ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి థియేటర్లను మూసివేస్తూ తెలంగాణ థియేటర్ల యాజమాన్యం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ సినిమాల్లో ఎన్ని సినిమాలు సమయానికి విడుదల అవుతాయనేది చెప్పలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. ఒకవేళ థియేటర్లు ఓపెన్ ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ధైర్యం చేసి సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లకు వచ్చే సాహసం చేయడం లేదు ప్రేక్షకులు. కరోనా కారణంగా మొన్న విడుదలైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు కూడా నష్టాలు తప్పలేదు. ఓపెనింగ్స్ అదిరిపోయినా.. వారం రోజుల తర్వాత పూర్తిగా చల్లబడిపోయింది. ఈ క్రమంలో సినిమాలను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ధైర్యం చేయలేకపోతున్నారు. అలాగని థియేటర్లలో తీసుకురావాల్సిన సినిమాలను డిజిటల్లో విడుదల చేయడం సరైన నిర్ణయం కాదు అంటున్నారు దర్శక నిర్మాతలు. దీంతో ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం దాదాపు 1200 కోట్ల వరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీ నష్టపోతుందని తెలుస్తోంది. మరి ఈ వైరస్ ఇంకా ఎంత కాలం ఇండస్ట్రీని పట్టి పీడిస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ట్రక్కు డ్రైవర్ గా రకుల్‌ప్రీత్‌సింగ్
పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
అల్లు అర్జున్ పాటను వాడేసిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్
కలర్స్ స్వాతి రీ ఎంట్రీ.. కొత్త కాన్సెప్ట్‌తో అలరించేందుకు రెడీ..!
జాతి రత్నాలు సీక్వెల్‌కు సన్నాహాలు.. స్టోరీ లైన్ ఇదే!