తన అందం,నటనతో ప్రేక్షకులను అలరించింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ( Deepika Padukone ). కన్నడ సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన దీపికా పదుకొనే బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించింది. ఈమె 2018లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రన్ వీర్ సింగ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. దీపికా బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక స్టార్ హీరోయిన్ గా నిలిచిన ఈ బ్యూటికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సాధారణంగా స్టార్లు ఎక్కడికి వెళ్లినా వాళ్లకు రక్షణగా బాడీగార్డ్స్ ( bodyguard ) ను పెట్టుకుంటారు. వాళ్ల కు నెల జీతం కూడా భారీగానే ఇస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా దీపికా బాడీగార్డ్ నెల జీతం ఎంత అనేది హాట్ టాపిక్ గా మారింది. దీపికా ఎక్కడికి వెళ్లినా తన వెంట జలాల్ అనే బాడీగార్డ్ ను తీసుకెళ్తుంది. 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే దీపికా తన బాడీగార్డ్ కు నెలకు 6.5 లక్షల జీతం ఇస్తుందట. ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు నోళ్లు వెల్లబెడుతున్నారు. ఈయన దీపికాకు ఎన్నో సంవత్సరాల నుండి రక్షణగా ఉంటున్నాడట.
అంతేకాకుండా అత్యధిక జీతం తీసుకుంటున్న బాడీగార్డ్ లలో జలాల్ మొదటి స్థానం లో ఉన్నాడు. ప్రస్తుతం దీపికా తన భర్త తో కలిసి 83 సినిమాలో, షారుక్ ఖాన్ తో పఠాన్ లో నటిస్తుంది. ఇదే కాకుండా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
దోస్తి వీడియో సాంగ్ ఐడియా ఎవరిదో చెప్పిన రాజమౌళి
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో