Spirit | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ ఎవెయిటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్ (Spirit). యానిమల్ ఫేం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెంచేస్తుందని తెలిసిందే. స్పిరిట్ ఎలా ఉండబోతుందో సినాప్సిస్ రూపంలో హింట్ ఇచ్చేసి క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్.
నెట్టింట రౌండప్ చేస్తున్న సినాప్సిస్ ప్రకారం.. న్యాయాన్ని నిలబెట్టేందుకు కృషి చేసే నిజాయితీ, అంకితభావం కలిగిన పోలీస్ (ప్రభాస్) విధి నిర్వహణలో అవమానానికి గురవుతాడు. అతని గౌరవాన్ని తిరిగి దక్కించుకునేందుకు గ్లోబల్ క్రైమ్ సిండికేట్‌ను వేటాడే నేపథ్యంలో సినిమా ఉండబోతుందట.
స్పిరిట్‌లో పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ (డాన్ లీ) మడాంగ్సియోక్ (MaDongSeok) విలన్‌గా నటిస్తున్నాడని తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆ సిండికేట్ మరెవరో కాదు.. డాన్ లీయేనట. దయాదాక్షిణ్యాలు లేని పోలీసాఫీసర్‌కు గ్లోబల్ క్రైమ్ సిండికేట్‌కు మధ్య జరిగే పోరు ఎలా ఉండబోతుందనన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
స్పిరిట్ కాప్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని ఇప్పటికే టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ 2025 జనవరి నుంచి షురూ కానుంది. త్వరలోనే దీని గురించి ప్రకటిస్తాం. అంతేకాదు కేవలం 6 నెలల గ్యాప్‌లోనే స్పిరిట్ షూట్ పూర్తి చేస్తాం. 2026 ప్రథమార్థంలో విడుదల చేస్తామని క్లారిటీ కూడా ఇచ్చాడు. ఈ చిత్రాన్ని సందీప్‌రెడ్డి వంగాతో కలిసి టి సిరీస్ అధినేత భూషణ్‌కుమార్ స్పిరిట్ నిర్మిస్తున్నారు.
#Spirit Plot(s) circulating in Social Media 🥵👌
– A disgraced cop, determined to regain his job, hunts down a ruthless international crime syndicate. The Ruthless Saga begins.
– A story of a honest, yet sincere cop. #Prabhas #SandeepReddyVanga pic.twitter.com/VmA4YXFLdT
— Movies4u Official (@Movies4u_Officl) December 12, 2024
Satyadev | బ్రతికిపోయాం.. ముఫాసా ది లయన్ కింగ్‌లో టాకాకు సత్యదేవ్ వాయిస్
Coolie | తలైవా బర్త్ డే స్పెషల్.. కూలీ షూట్ లొకేషన్లో ఉపేంద్ర, అమీర్‌ఖాన్
Vishwak Sen | జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్సేన్ సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్ లుక్..!