అఖిల్‌రాజ్, త్రిగుణ్, హెబ్బాపటేల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. హేమ వెంకటేశ్వరరావు నిర్మాత. ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్ సమర్పకుడు. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌బస్టర్ మీట్‌ని మేకర్స్ నిర్వహించారు.
గట్టి వసూళ్లతో సినిమా దూసుకుపోతున్నదని, తొలి రోజే తెలుగు రాష్ర్టాల్లో రెండు కోట్ల 20లక్షలు వసూలు చేసిందని, ఫైనల్‌గా బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచిందని సమర్పకుల్లో ఒకరైన బన్నీవాస్ చెప్పారు. ఇది కేవలం హారర్ ఫిల్మ్ మాత్రమే కాదని, ఆలోచింపజేసే సినిమా ఇదని మరో సమర్పకుడు వంశీ నందిపాటి చెప్పారు. ఇంకా నిర్మాత వెంకటేశ్వరావు, నటుడు త్రిగుణ్, సీనియర్ నిర్మాత దామోదరప్రసాద్ కూడా మట్లాడారు.