టెహ్రాన్ : అమెరికాకు చెందిన స్టీల్త్ ఫైటర్ విమానం ఎఫ్-35( F-35 Stealth Fighter)ని ఇరాన్ కూల్చివేసింది. ఈ విషయాన్ని ఇరాన్ ద్రువీకరించింది. ఎఫ్-35ని ఢీకొట్టిన వీడియోను ఇరాన్ మీడియా రిలీజ్ చేసింది. స్థానిక మీడియా ఈ వీడియోను ప్రసారం చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో అత్యాధునిక ఎఫ్-35 విమానాన్ని కూల్చినట్లు తెలుస్తోంది. సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో ఈ అటాక్ జరిగింది. అయితే ఇరాన్ జరిపిన ఫైరింగ్‌లో తమ ఎఫ్-35 యుద్ధ విమానం కూలినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ కూడా పేర్కొన్నది. ఆ ఎయిర్‌క్రాఫ్ట్ సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, పైలట్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు కెప్టెన్ టిమ్ హాకిన్ తెలిపారు. ఈ ఘటన పట్ల దర్యాప్తు చేపడుతున్నామని ఆయన అన్నారు.
యుద్ధంలో పాల్గొంటున్న ఆ విమానాన్ని.. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాక్ చేసి కొట్టేసింది. అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించి, ఆ విమానం గతితప్పింది. ఆ దృశ్యాలు వీడియోలో కనిపించాయి. స్థానికంగా గురువారం మధ్యాహ్నం 2.50 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు ఇరాన్ గార్డ్స్ ప్రకటించారు. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో ఢీకొట్టడంతో.. ఆ విమానం చాలా తీవ్రంగా దెబ్బతినట్లు ఇరాన్ పేర్కొన్నది.
ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న సమరంలో అత్యాధునిక విమానం కూల్చిన ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటికే పలు విమానాలను అమెరికా కోల్పోయింది. కువైట్ దళాలు జరిపిన ఫ్రెండ్లీ ఫైరింగ్‌లో మూడు ఎఫ్-15 విమానాలు కూలిన విషయం తెలిసిందే. ఇక ఇరాక్‌లో ఓ కేసీ-135 రీప్యుయలింగ్ విమానం కూడా కూలింది. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా కేంద్రాల్లో ఇప్పటి వరకు సుమారు 200 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు.