Shekhar Kammula | హైదరాబాద్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఘటనపై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు స్కూలు గుర్తింపును రద్దు చేశారు. మరోవైపు ఈ ఘటనపై సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘డీఏవీ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడటం ఘోరమైన ఘటన. నిస్సహాయతతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఆ చిన్నారి పడే వేదనను ఊహించలేకపోతున్నాను. ఎంతో ధైర్యంతో పోరాటం చేస్తున్న బాలిక తల్లిదండ్రులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదు. ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకూడదు. చిన్నారుల కోసం సురక్షితమైన వాతావరణాన్ని మనమే కల్పించాలి’’ అంటూ పోస్టు చేశారు.
#DAVPublicSchool pic.twitter.com/JLpFVpRLLp
— Sekhar Kammula (@sekharkammula) October 21, 2022