రణబీర్‌కపూర్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో హైఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే ఈ సినిమాలో హింస శృతిమించిందని, మహిళా పాత్రల్ని తక్కువ చేసి చూపించారనే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా వీటిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. అదే సమయంలో సినిమా సీక్వెల్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
“యానిమల్’ సినిమాలో హీరో రణబీర్ పర్ఫార్మెన్స్ను ప్రశంసిస్తూ, నాపై విమర్శలు చేశారు. నేను బాలీవుడ్‌కు కొత్త కాబట్టి ఎలాంటి విమర్శలు చేసినా ఏం కాదనే ధోరణి వారిది. కానీ రణబీర్‌కపూర్‌తో సినిమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆయన్ని ఏమీ అనలేకపోయారు’ అని సందీప్‌రెడ్డి వంగా తెలిపారు. ‘యానిమల్’ సినిమాను స్క్రిప్ట్దశలోనే మూడు భాగాలుగా తీయాలనుకున్నానని, రెండో భాగం ‘యానిమల్ పార్క్’లో రణబీర్‌కపూర్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని, హీరో..విలన్ పాత్రల్ని ఆయనే పోషిస్తారని సందీప్‌రెడ్డి వంగా పేర్కొన్నారు.