2020లో యువ హీరో విశ్వక్సేన్తో హిట్ (HIT) సినిమా చేసి.. తొలి ఎంట్రీలోనే బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu). క్రైం థ్రిల్లర్ జోనర్లో సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సాగే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. డైరెక్టర్‌గా శైలేష్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. హిట్‌ను ప్రాంఛైజీగా ప్లాన్ చేసిన శైలేష్ కొలను ఇటీవలే హిట్ 2 (HIT 2)తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఈ సారి టాలెంటెడ్ యాక్టర్ అడివిశేష్‌ను సీక్వెల్లో హీరోగా పెట్టాడు. ఈ సినిమా కూడా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చి.. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. హిట్ 2 ప్రమోషన్స్ భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిట్ 3 గురించి కూడా అప్డేట్ ఇచ్చేసి మూవీ లవర్స్ లో జోష్ నింపాడు శైలేష్ కొలను.
సీక్వెల్‌కు నిర్మాతగా వ్యవహరించిన న్యాచురల్ స్టార్ నానితో హిట్ 3 ఉంటుందని కూడా చెప్పేశాడు. అయితే తాజా హిట్ ప్రాంఛైజీ హీరోలందరితో కలిసి దిగిన స్టిల్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. పెద్దదే ప్లాన్ చేస్తున్నాం.. హిట్ 3 (HIT 3)భారీ స్థాయిలో ఉండబోతుంది. బాణసంచా లోడ్ అవుతోంది.. అని ట్వీట్ చేశాడు. ఈ స్టిల్ ఇపుడు నెట్టింట్లో తెగ ట్రెండింగ్ అవుతోంది.
హిట్ ప్రాంఛైజీ హీరోలతో శైలేష్ కొలను..
Peddade plan chesthunnam. #Hit3 will be massive. Fireworks loading 🙂 @VishwakSenActor @NameisNani @AdiviSesh @walpostercinema @tprashantii pic.twitter.com/Rz4y6OrRRJ
— Sailesh Kolanu (@KolanuSailesh) December 5, 2022
Read Also :Lokesh kanagaraj | క్రేజీ టాక్.. విజయ్-లోకేశ్ కనగరాజ్ సినిమా లాంఛ్ రేపే..?
Read Also :SDT 15 | SDT 15కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్.. స్టన్నింగ్ అప్డేట్ వీడియో
Read Also :Panchathantram | పంచతంత్రం ప్రీ రిలీజ్‌ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?