దర్శకనిర్మాత సత్యారెడ్డి ఓ భారీ బడ్జెట్ చిత్రంతో హాలీవుడ్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన పాన్ వరల్డ్ సినిమాస్ పేరుతో ఓ బ్యానర్‌ను స్థాపించారు. హాలీవుడ్ స్థాయిలో నిర్మించే ఈ చిత్రానికి ‘కింగ్బుద్ధ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘సర్దార్ చిన్నపరెడ్డి’ చిత్రంతో సినీ జీవితాన్ని ప్రారంభించిన సత్యారెడ్డి దాదాపు 55 చిత్రాలకు దర్శకనిర్మాతగా బాధ్యతలు నిర్వహించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘ఉక్కు సత్యాగ్రహం’ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. ‘కింగ్ బుద్ధ’ సినిమా లొకేషన్ల కోసం ఇప్పటికే అమెరికా, చైనా, టిబెట్, నేపాల్, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా తదితర దేశాలు పర్యటించానని, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతున్నదని సత్యారెడ్డి తెలిపారు.