ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ తనయుడు దినేష్ మహీంద్ర తండ్రి బాటలోనే మెగాఫోన్ పట్టబోతున్నారు. దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ఓ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. దినేష్ మహీంద్ర ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దర్శకత్వ విభాగంలో శిక్షణ పొందారు. స్క్రీన్‌ప్లే అంశంలో పలు కోర్సులను పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని ఆరెక్స్ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్ జరుగుతున్నదని, ఏప్రిల్‌లో షూటింగ్‌ను ప్రారంభిస్తామని చిత్ర బృందం తెలిపింది. నూతన తారలు, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నామని, త్వరలో మరిన్ని వివరాలను వెల్లడిస్తామని మేకర్స్ పేర్కొన్నారు.