Director Krish | లాంగ్ గ్యాప్ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వస్తోంది టాలీవుడ్ బ్యూటీ అనుష్కా శెట్టి (Anushka Shetty). క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఘాటి (Ghaati). సెప్టెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మరికొన్ని గంటల్లో సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. కాగా ప్రమోషన్స్‌లో డైరెక్టర్ క్రిష్ ఆసక్తికర విషయం ఒకటి షేర్ చేశాడు.
విభిన్నమైన స్టోరీ టెల్లింగ్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో క్రిష్ స్టైలే వేరని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు తాను తెరకెక్కించిన చిత్రాల్లో ఉత్తమ సినిమా ఎన్టీఆర్ బయోపిక్ అన్నాడు క్రిష్. ప్రమోషనల్ ఇంటర్వ్యూలో క్రిష్ మాట్లాడుతూ.. లెజెండరీ యాక్టర్, పొలిటిషియన్ నందమూరి తారక రామారావు జీవిత కథపై పనిచేయడం గౌరవంతోపాటు గొప్ప బాధ్యత అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎన్టీఆర్ బయోపిక్ సృజనాత్మకంగా, భావోద్వేగపూరిత అంశాల పరంగా తనకు చాలా చాలెంజ్ విసిరిందని అన్నాడు. అంతేకాదు బాలకృష్ణ కెరీర్లోఉత్తమ నటనను కనబరిచిన సినిమా ఇదన్నాడు.
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చైతన్య రావ్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన జనాలంతా కొండ ప్రాంతం మధ్యలోని దారి వెంట మూటలు మోసుకొని వెళ్తున్న లుక్‌తోపాటు గ్లింప్స్ సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఘాటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కానుంది.
Shilpa Shetty | కొత్తగా మీ ముందుకొస్తున్నాం.. రెస్టారెంట్ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి
Ghaati | ఘాటి అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టిక్కెట్స్